ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి: సీఎం (వీడియో)

AP: సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని అన్నారు. “చేసిన పనులు వివరించాలి, సమర్థ పాలన, జీఎస్టీ లాభాలు, కూటమి విజయాలు ప్రజలకు తెలియాలి. పార్టీ ప్రతినిధులు ప్రజల నమ్మకాన్ని పెంచే విధంగా పనిచేయాలి. ప్రజలు మనవైపు ఉంటే రాష్ట్ర అభివృద్ధి వేగంగా ముందుకు వెళ్లుతుంది” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్