AP: వైసీపీ పాలనలో రాష్ట్రంలో ఎప్పుడు యూరియా కొరత లేదని, రైతులు ఎప్పుడూ రోడ్డు ఎక్కలేదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి తెలిపారు. అప్పుడు లేని రైతు కష్టాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయని ప్రశ్నించారు. సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా రైతుల పరిస్థితి దారుణంగా ఉందని పేర్కొన్నారు. యూరియాను టీడీపీ నాయకులే పక్కదారి పట్టించి అమ్ముకుంటున్నారంటూ ఆరోపించారు.