AP: ఉపాధికోసం వలసలు వెళ్లే పరిస్థితి రాష్ట్ర ప్రజలకు రాకూడదని మంత్రి మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. దీనికోసం రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెంచడమే ప్రధాన లక్ష్యంగా తమ ప్రభుత్వ పని చేస్తోందని మంత్రి తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుతో రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, తద్వారా నిరుద్యోగ సమస్య కూడా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఈ దిశగా కృషి చేస్తుందని మంత్రి అనగాని తెలిపారు.