ఇది ఏపీకి చరిత్రాత్మకమైన రోజు: మంత్రి లోకేశ్ (వీడియో)

AP: విశాఖలో గూగుల్ అడుగుపెట్టడం రాష్ట్రానికి చరిత్రాత్మకమైన రోజు అని మంత్రి లోకేశ్ అభివర్ణించారు. మంగళవారం ఢిల్లీలో గూగుల్‌తో ఒప్పంద కార్యక్రమంలో మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ఇది గ్లోబల్ టెక్ మ్యాప్‌పై ఏపీని బలంగా నిలబెట్టే మైలురాయి అవుతుందని ఆయన అన్నారు. కేంద్ర సహకారం, సీఎం చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రానికి మరిన్ని ప్రాజెక్టులు వస్తాయన్నారు. డిజిటల్ హబ్ దేశానికి మంచి గుర్తింపు తెస్తుందని మంత్రి లోకేశ్ తెలిపారు.

సంబంధిత పోస్ట్