గూడూరు ఏరియా ఆస్పత్రిలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారయత్నం జరిగిన ఘటన కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు శుక్రవారం ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేరిన ఒక వ్యక్తి కుమార్తెపై, అదే వార్డులో పేషెంట్ అటెండర్గా ఉన్న జమీర్ అనే వ్యక్తి అత్యాచారయత్నానికి పాల్పడినట్లు తెలిపారు. బాధిత తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు.