రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ, నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్‌లతో కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాధరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలో వారిని గురువారం ఆమె మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి నారాయణకి విద్యాధరి పూలమొక్కను అందచేశారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై సుదీర్ఘంగా చర్చించారు.