చిత్తూరు జిల్లా, పుంగనూరు పట్టణ పరిధిలోని బైపాస్ రోడ్ మలుపు వద్ద ఉన్న బారి గుంతలను శుక్రవారం విశ్రాంత డీఎస్పీ సుకుమార్ బాబు పూడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం ఎందరో వాహన చోదకులు ఈ గుంతల వలన గాయాల పాలవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో కార్యక్రమంలో రిటైర్డ్ ఎస్సై సత్యనారాయణ, బాబు భరత్ భూషణ్, దేశాధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.