సత్యవేడు: సిద్ధార్థ కాలేజీ హాస్టల్‌లో ర్యాగింగ్ కలకలం

నారాయణవనం సిద్ధార్థ డిగ్రీ కాలేజీ హాస్టల్‌లో ఫస్ట్‌ ఇయర్‌ విద్యార్థిపై ఐదుగురు సీనియర్ విద్యార్థులు ర్యాగింగ్ చేసి, విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. కొడుతూ వీడియో తీసి, బయట చెబితే చంపేస్తామని బెదిరించారు. బీసీ వర్గానికి చెందిన గాయపడిన విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ఆదివారం ప్రారంభించారు. ఈ ఘటనపై హాస్టల్ వార్డెన్, కళాశాల యాజమాన్యం నిర్లక్ష్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

సంబంధిత పోస్ట్