తొట్టంబేడు మండలం పెద్ద కన్నలి పంచాయతీ కొత్త కండ్రిగలో అంత్యక్రియలు నిర్వహించడానికి గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షపు నీరు చేరి శ్మశానం చెరువులా మారడంతో మృతదేహాలను పూడ్చడానికి కష్టమవుతోంది. శ్మశానం రోడ్డుకి దిగువన ఉండటంతో వర్షం వచ్చినప్పుడల్లా నీటితో నిండిపోతుంది.