AP: విశాఖపట్నం జిల్లాలోని మాధవధారలో పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. టీ స్టాల్ వద్ద మామిడి తోరణాలు కడుతున్న సమయంలో సర్వీస్ వైర్ తెగి పడి టీ స్టాల్ నిర్వహిస్తున్న బత్తిన ఈశ్వరావు (52) తీవ్రంగా గాయపడ్డాడు. ఆసుపత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యంలో మృతి చెందాడు. పక్కన టీ తాగుతున్న గవర కంచరపాలెం ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ (50)కి గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.