విషాదం.. చెరువులో ఈతకు దిగి యువకుడు మృతి (వీడియో)

AP: ఎన్టీఆర్ జిల్లాలోని గంపలగూడెం మండలంలో ఆదివారం విషాదం చోటు చేసుకుంది. తునికిపాడు గ్రామానికి చెందిన విలారపు వంశి అనే యువకుడు తెలంగాణలోని మధిరలో ఉన్న పెద్ద చెరువులో ఈతకు దిగి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలికి చేరుకుని గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఘటనా స్థలిలో కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్