జనార్దన్ - జోగి బ్రదర్స్ మధ్య లావాదేవీలు జరిగాయి: ఎక్సైజ్ అధికారులు

AP: నకిలీ మద్యం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన నిందితుడు జనార్దన్ రావు బ్రదర్స్, జోగి బ్రదర్స్ మధ్య డబ్బు లావాదేవీలు జరిగాయని ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు. జోగి రమేశ్ సూచనల మేరకు, 2022లో ఫెర్రీ ఘాట్ దగ్గర రూ.14 లక్షలు తన సోదరుడు రాముకు ఇచ్చినట్లు జనార్దన్ తెలిపాడు. మళ్లీ కొన్నాళ్ల తరువాత అదే ప్రాంతంలో రూ.15 లక్షల నగదు అందించినట్లు ప్రత్యక్ష సాక్షి మురళి పేర్కొన్నారు. ఈ డబ్బు బదిలీపై ఎక్సైజ్ అధికారులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్