AP: కూటమి ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గేది లేదని ఎంపీ మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. తనపై పెట్టిన కేసుల వలన ఎటువంటి ప్రయోజనం లేదని, తన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మద్యం కేసు కోర్టులో ఉన్నందున దాని గురించి మాట్లాడలేనన్నారు. అయితే, తనను జైలులో టెర్రరిస్ట్ మాదిరిగా చూశారని ఆయన ఆరోపించారు. ఎన్ని కేసులు పెట్టినా ధైర్యంగా ముందుకు వెళతామని ఎంపీ తేల్చి చెప్పారు.