AP: ద్రోణి ప్రభావం కారణంగా గురువారం పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. కృష్ణా, ప్రకాశం,నెల్లూరు, అనంతపురం, శ్రీసత్యసాయి, కడప,అన్నమయ్య,చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.