AP: కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై సోషల్ మీడియాల్లో అసభ్యకర వ్యాఖ్యలు చేసిన ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. తెదేపా నుంచి బహిష్కరణకు గురైన విజయలక్ష్మి అనే మహిళ.. ఎమ్మెల్యేపై అసభ్యకర వ్యాఖ్యలు చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. విజయలక్ష్మి వ్యాఖ్యలను ఇస్మాయిల్ అనే వ్యక్తి SMలో ట్రోల్ చేశాడు. దీంతో వారిద్దరినీ కడప వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. ట్రోల్ చేసిన మరో 15 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు. నిందితులపై రౌడీషీట్ ఓపెన్ చేస్తామని పోలీసులు తెలిపారు.