నేటికి రెండేళ్లు.. తండ్రి అరెస్ట్‌పై మంత్రి లోకేష్ భావోద్వేగం

ఏపీ సీఎం చంద్రబాబును వైసీపీ హయాంలో అరెస్టు చేసి నేటికి రెండేళ్లు అయింది. ఈ విషయాన్ని గుర్తు చేసుకుంటూ మంత్రి నారా లోకేశ్ ఎక్స్‌లో పోస్ట్ పెట్టారు. ‘రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున నా తండ్రిని అన్యాయంగా అరెస్టు చేశారు. ఈ ఘటన మా కుటుంబానికి మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికే చీకటి అధ్యాయంగా నిలిచిపోయింది. ఆయన ధైర్యం, గౌరవం, రాష్ట్ర ప్రజలపై ఆయనకున్న విశ్వాసం మా పోరాటానికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి’ అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్