ముంపులోనే వంశధార పరీవాహక ప్రాంతాలు (వీడియో)

AP: వాయుగుండం ప్రభావంతో ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ వరద పోటెత్తి శ్రీకాకుళం జిల్లాలోని నాగావళి, వంశధార నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. శుక్రవారం 1.04 లక్షల క్యూసెక్కులకు చేరిన వంశధార వరద ప్రవాహం.. శనివారం క్రమేపీ తగ్గుతూ 40 వేల క్యూసెక్కులుగా ఉంది. 68 గ్రామాలు ముంపు బారిన పడ్డాయి. శ్రీకాకుళం నగరంతో పాటు పలు ఊళ్లు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. దాదాపు 8 వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.

సంబంధిత పోస్ట్