AP: లిక్కర్ స్కాం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇటీవల జైలులో అనారోగ్యానికి గురయ్యారు. చికిత్స కోసం ఆయన కోర్టు అనుమతి కోరుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మంతెన సత్యనారాయణ ఆశ్రమంలో చికిత్సకు అనుమతివ్వాలని పిటిషన్‌లో కోరారు. ఈ పిటిషన్‌పై విచారణ పూర్తి చేసిన కోర్టు, ప్రస్తుతం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ నెల 10వ తేదీన తుది తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.