ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన సోదరుడు చిరంజీవికి ఎక్స్ వేదికగా పుట్టిన రోజు శుభాంక్షలు తెలిపారు. పవన్ విషెస్ పై చిరంజీవి స్పందిస్తూ.."తమ్ముడు కల్యాణ్ ప్రేమతో పంపిన పుట్టిన రోజు శుభాకాంక్షలు అందాయి. నీ ప్రతీ మాట ప్రతీ అక్షరం నా హృదయాన్ని తాకింది. అన్నయ్యగా నన్ను చూసి నువ్వెంత గర్విస్తున్నావో ఓ తమ్ముడిగా నీ విజయాల్ని, నీ పోరాటాన్ని నేను అంతగా ఆస్వాదిస్తున్నాను" అని ట్వీట్ పెట్టారు.