నేపాల్‌లోని పొక్రోన్‌లో ఈ నెల 7 నుంచి 10 వరకు జరిగిన ఇండో-నేపాల్ యూత్ స్పోర్ట్స్ ఛాంపియన్ 2025లో ఉమ్మడి జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో ఇండియా తరపున రన్నింగ్ విభాగంలో పార్వతీపురం మండలం డి. మూలగాకు చెందిన యాళ్ల ఈశ్వర్రావు (800మీ), విజయనగరం జిల్లా గజపతినగరం మండలం భూదేవిపేటకు చెందిన సూర్యతేజ (400మీ) స్వర్ణపతకాలు సాధించారు. వీరి విజయంపై పలువురు అభినందనలు తెలుపుతూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.