పురిడిపంటలో సామూహిక కుంకుమ పూజలు

గజపతినగరం మండలం పురిడిపంట షరాబల కాలనీలో శనివారం దుర్గాదేవి అమ్మవారి గ్రామ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజు లలితా దేవి అవతారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం భక్తులు అమ్మవారి తీర్థ ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్