విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలోని గొట్లాం ఫీడర్ లైన్ నిర్వహణ పనుల కారణంగా, శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు గొట్లాం, అంబటివలస, రోళ్ల వాక, జీఎన్వలస, అయ్యన్నఅగ్రహారం, డోల పేట, రెడ్డిపేటల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని విద్యుత్ ఈఈ బి. రఘు తెలిపారు. ఈ పనులు సకాలంలో పూర్తి చేయడానికి విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.