బొండపల్లి మండలంలోని దేవుపల్లి గ్రామంలో స్వయంభుగా వెలసిన రాజరాజేశ్వరీ దేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు దుర్గాదేవిగా దర్శనమిచ్చారు. ఆలయ అర్చకులు దూసి శ్రీధర్ శర్మ అమ్మవారిని దుర్గాదేవిగా అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గజపతినగరం నియోజకవర్గంలోని ఈ ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.