సీతంపేటలో బండిమ్మ, పసులమ్మ తల్లి వారాలు ఘనంగా నిర్వహణ

ఎస్ కోట మండలం సీతంపేట గ్రామంలో ఆదివారం గ్రామస్తులు బండిమ్మ తల్లి వారాలతో పాటు పసులమ్మ తల్లి పండగను ఘనంగా నిర్వహించారు. డప్పులు, మేళతాళాల మధ్య భక్తులు ఆలయానికి చేరుకుని, పసుపు కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పశువులకు కూడా పూజలు చేశారు. సాయంత్రం కొత్తమ్మతల్లికి పూజలు చేసి నైవేద్యం సమర్పించనున్నారు.

సంబంధిత పోస్ట్