బొబ్బిలి మండలం కోమటిపల్లి గ్రామ శ్రీ ఉమా రామ లింగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా శివస్వాములకు సీతానగరం మండలం సన్యాసిరాజుపేట గ్రామానికి చెందిన పుచ్చల రవి కుమార్, లత దంపతులు భిక్షను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. కార్తీక మాసం సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి.