బొబ్బిలిలో, మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు రేవళ్ల కిరణ్ కుమార్ నేతృత్వంలో, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, బెడ్ రెడెన్ పేషెంట్ల కోసం సోమవారం వారి ఇళ్లకే వెళ్లి డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్లను తయారు చేసి సంబంధిత కార్యాలయాలకు పంపించారు. ప్రతి సంవత్సరం మాజీ సైనిక పెన్షనర్లు జీవిత ధ్రువీకరణ పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ సేవలను మాజీ సైనికులు అభినందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మరడ రాము నాయుడు, మాజీ సైనికులు ఏం ఎల్ రావు, ఏ గోవింద నాయుడు, ఎస్ ఆర్ మోహనరావు, వి యన్ శర్మ, పాండ్రాంకి రవి పాల్గొన్నారు.