బొబ్బిలి డివిజన్ పరిధిలోని ప్రభుత్వ వసతి గృహాల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వాటిని సక్రమంగా నిర్వహించకపోతే సస్పెండ్ చేస్తానని సోషల్ వెల్ఫేర్ డీడీ అన్నపూర్ణమ్మ ASWO సత్యనారాయణను హెచ్చరించారు. బొబ్బిలిలో మంగళవారం వార్డెన్లు, ASWOలతో జరిగిన సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. పనితీరులో మార్పు రాకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని, పని చేయకపోతే సెలవు పెట్టాలని ఆమె సూచించారు.