ఇప్పటికే దేశవిదేశాల్లో విశేష ప్రాచుర్యం పొందిన బొబ్బిలి వీణకు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఓన్ డిస్ట్రిక్ట్. ఓన్ ప్రొడక్ట్ (ఓడిఓపి) క్రింద బొబ్బిలి బహుమతి వీణ ఎంపికయ్యింది. ఈ పురస్కారాన్ని అందుకొనేందుకు విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ ఢిల్లీ వెళ్లారు. సోమవారం జరిగే కార్యక్రమంలో ఓడిఓపి అవార్డును కలెక్టర్ అందుకోనున్నారు.