బొబ్బిలిలో పర్యటించిన కేంద్ర బృందం

ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన పనులను కేంద్రబృందం సోమవారం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. ఉపాధి హామీ పథకం కేంద్ర సంచాలకుడు సునీల్ బంట, సహాయ సంచాలకుడు నత్తూ సింగ్, స్థానిక అధికారులతో కలిసి బొబ్బిలి మండలంలోని శివడవలసలో నిర్మించిన పశువుల నీటి తొట్టెలు, ఫాం పాండ్లు, సీసీ రోడ్లు, కందకం పనులను పరిశీలించారు. ఏ పనికి ఎన్ని నిధులు మంజూరయ్యాయి, ఎంత ఖర్చు చేశారనే వివరాలపై ఆరాతీశారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడారు.

సంబంధిత పోస్ట్