బలిజిపేట రోడ్లో భారీ ట్రాఫిక్ జామ్.. ప్రజలకు తీవ్ర ఇబ్బందులు

మంగళవారం ఉదయం బొబ్బిలి పట్టణంలోని సాయి గణపతి థియేటర్ సమీపంలో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. స్కూల్ టైమ్‌లో వాహనాల రద్దీ పెరగడంతో విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. షాపింగ్ మాల్ నిర్మాణ పనుల కోసం టిప్పర్ లారీలు, టెలిఫోన్ లైన్ కోసం తీసిన గుంతలు సరిగా పూడ్చకపోవడంతో రహదారి దెబ్బతినడం, వాహనదారులు ఆ దిబ్బలను తప్పించుకునే క్రమంలో ట్రాఫిక్ నిలిచిపోవడానికి కారణమైంది. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్