బొబ్బిలి నియోజకవర్గంలోని రామభద్రపురం మండలం ముచ్చర్లవలస గ్రామంలో డయేరియా వ్యాప్తి చెందింది. గురువారం ఎమ్మెల్యే ఆర్. వీ. ఎస్. కే. కే. రంగారావు (బేబీ నాయన) బాధితులను పరామర్శించారు. 16 మందిలో పలువురు కోలుకున్నారు. తుఫానుతో నీరు కలుషితమైందని, ప్రజలు నీటిని వేడిచేసి తాగాలని సూచించారు. గ్రామ సర్పంచ్, పెద్దల చర్యలను ఎమ్మెల్యే ప్రశంసించారు.