ఈస్ట్ కోస్ట్ రైల్వే కమిటీ సమావేశంలో ఎంపీ కలిశెట్టి

ఈస్ట్ కోస్ట్ రైల్వే వాల్తేర్ డివిజన్ కమిటీ మీటింగ్‌లో విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, ఇతర ఎంపీలు, రైల్వే అధికారులు పాల్గొన్నారు. ఎంపీ కలిశెట్టి, విజయనగరం, బొబ్బిలి, చీపురుపల్లి స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యాల పెంపు, మరుగుదొడ్లు, షెడ్లు, ఎస్కలేటర్లు, అదనపు రైళ్లు, స్టాపేజీలు కల్పించాలని, నిలిచిపోయిన పనులు వేగవంతం చేయాలని, రైల్వే రహదారుల మరమ్మతులు తక్షణమే పూర్తి చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్