రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్న ప్రమాదంలో ఓ డ్రైవర్ కు గాయాలైన ఘటన బొండపల్లి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని గొట్లాం బైపాస్ రోడ్ లో శనివారం ఉదయం రెండు లారీలు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ లారీ డ్రైవర్ కేబిన్ లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న అగ్రిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకొని క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్ ను బయటకు తీసి 108 లో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు.