లింగ నిర్ధారణ నిషేధం: డీఎంహెచ్ఓ హెచ్చరిక

పీసీ అండ్ పీఎన్‌డీటీ చట్టం ప్రకారం లింగ నిర్ధారణ పూర్తిగా నిషేధమని జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డా. జీవనరాణి స్పష్టం చేశారు. శుక్రవారం డీఎంహెచ్ఓ కార్యాలయంలో జరిగిన సలహా మండలి సమావేశంలో ఆమె మాట్లాడుతూ, ప్రతి స్కానింగ్ సెంటర్ తప్పనిసరిగా నిర్వహించిన పరీక్షల వివరాలు నమోదు చేసి సమర్పించాల్సిందిగా ఆదేశించారు. జిల్లాలో ప్రభుత్వానికి చెందిన 22 స్కానింగ్ సెంటర్లతో పాటు ప్రైవేట్ రంగంలో మరో 102 సెంటర్లు పనిచేస్తున్నాయని తెలిపారు. చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్