జయతి గ్రామంలో శనివారం ఆర్ఎస్ఎస్ జిల్లా బౌద్ధిక ప్రముఖ కొయ్యాన నాయుడు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా గత 100 సంవత్సరాలుగా 81 వేల శాఖల ద్వారా లక్షలాదిమందిని దేశభక్తి, క్రమశిక్షణ గల వ్యక్తులుగా ఆర్ఎస్ఎస్ తీర్చిదిద్దుతోందని తెలిపారు. అయోధ్య రామాలయ నిర్మాణంలో, అక్షింతలను ఇంటింటికి చేర్చడంలో సంఘ కార్యకర్తల కృషి మరువలేనిదని కొనియాడారు. సంఘం స్థాపించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా, ప్రతి గ్రామం, బస్తీలో ఇంటింటికీ సంఘ్ ను పరిచయం చేయాలనే యోజనతో శతాబ్ది కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.