బేబీ రాణికి పదోన్నతి.. జీసీసీ కార్యాలయంలో ఘన వీడ్కోలు

పార్వతీపురం జీసీసీ కార్యాలయంలో సీనియర్ అకౌంటెంట్‌గా పనిచేసిన ఎల్ బేబీ రాణి, విశాఖపట్నం జీసీసీ మార్కెటింగ్ డీఆర్ సెక్షన్ సూపరింటెండెంట్‌గా పదోన్నతి పొందుతూ బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా జీసీసీ కార్యాలయంలో ఘన వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. డివిజనల్ మేనేజర్ జె రామారావు, మేనేజర్ ఎం సాంబశివరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఆమెను సత్కరించారు. గిరిజన ప్రాంత సమస్యల పరిష్కారంలో ఆమె చూపిన చొరవను ప్రశంసించారు. భవిష్యత్తులో మరిన్ని ఉన్నత హోదాలు సాధించాలని ఆకాంక్షించారు.

సంబంధిత పోస్ట్