ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలి – జాయింట్ కలెక్టర్

మన్యం జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు జాయింట్ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి మంగళవారం సంబంధిత శాఖలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అధికారులు కొనుగోలు కేంద్రాల్లో ఉండి రైతులకు సహకరించాలని, తేమ శాతం అంశంలో ఫిర్యాదులు రాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా గోదాములకు తరలించేందుకు రవాణా శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుల ఖాతాల్లో సకాలంలో చెల్లింపులు జరిగేలా పారదర్శకత పాటించాలని చెప్పారు.

సంబంధిత పోస్ట్