కనిమెట్టలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం

పూసపాటిరేగ మండలం కనిమెట్ట గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే లోకం నాగ మాధవి లబ్ధిదారులకు నేరుగా పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, పేదల ముఖాల్లో చిరునవ్వు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని, ముఖ్యమంత్రి చంద్రబాబు పింఛన్ల మొత్తాన్ని పెంచి నెలాఖరులోపే నిధులు విడుదల చేస్తున్నారని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్