రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకత్వంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నానని పార్వతిపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర అన్నారు. గురువారం ఆయన బలిజిపేట మండలంలోని నూకలవాడ, వంతరాం గ్రామాల వరద తాకిడి ప్రాంతాలను పరిశీలించారు. శాసనసభ సబ్ కమిటీ సమావేశం కారణంగా ఆలస్యమైనా, అక్కడి నుంచే అధికారులను అప్రమత్తం చేసి సహాయక చర్యలు చేపట్టేలా చేశానని తెలిపారు. వరద బాధితులకు అండగా నిలుస్తామని ఆయన హామీ ఇచ్చారు.