మన్యం జిల్లా మక్కువ మండలంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ములక్కాయవలస గ్రామానికి చెందిన గండి జగదీష్ అనే అయ్యప్ప స్వామి భక్తుడు గాయపడ్డాడు. అయ్యప్ప స్వాములతో మాట్లాడుతుండగా, అతివేగంగా వచ్చిన ఓ స్కూల్ బస్సు డ్రైవర్ ట్రాక్టర్‌ను తప్పించబోయి జగదీష్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో ఆయన కుడి కాలుకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అతన్ని మక్కువ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం బొబ్బిలి ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.