ఆర్టీసీ బస్సు ఢీకొని విశ్రాంతి ఉపాధ్యాయుడు గాయాలు

మన్యం జిల్లా మక్కువ మండల కేంద్రంలో ఆర్టీసీ బస్సు ఢీకొని విశ్రాంత ఉపాధ్యాయుడు ఆకుల తవిటి నాయుడు తీవ్రంగా గాయపడ్డారు. నాలుగు రోడ్ల కూడలిలో బస్సు మలుపు తిప్పే సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఆయన ఎడమ కాలు నుజ్జు అవ్వడంతో స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం అందించారు. ఎస్సై ఎం. వెంకటరమణ సహాయంతో గాయపడిన వారిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యులు విజయనగరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్