సోమవారం మన్యం జిల్లా పర్యటనలో భాగంగా, విజయనగరం సీనియర్ సివిల్ జడ్జి, సెక్రటరీ ఎ. కృష్ణ ప్రసాద్ పట్టణంలోని సబ్ జైలును ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఖైదీల స్థితిగతులు, ఆహారం, ఆరోగ్యం, భద్రత, రికార్డుల నిర్వహణ వంటి అంశాలను ఆయన పరిశీలించారు. జైలు సిబ్బంది క్రమశిక్షణతో, నిబద్ధతతో పనిచేయాలని, ఖైదీల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన ఆదేశించారు.