విద్యార్థికి పాము కాటు... ప్రభుత్వాసుపత్రిలో చికిత్స

రాజాం మండలంలోని డోలపేట గ్రామంలో ఎనిమిదో తరగతి చదువుతున్న నిఖిల్ అనే విద్యార్థికి ట్యూషన్‌కు వెళ్తుండగా పాము కాటు వేసింది. రోడ్డు పక్కన నడుస్తుండగా పాము కాలుకు చుట్టుకొని కాటు వేసినట్లు స్థానికులు తెలిపారు. వెంటనే కుటుంబ సభ్యులు నిఖిల్‌ను రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు అత్యవసర చికిత్స అందిస్తున్నారు. బాలుడి పరిస్థితి ప్రస్తుతం స్థిరంగా ఉన్నట్లు సమాచారం.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్