రోడ్లపై మూగజీవుల సంచారం... ప్రమాద భయం ప్రజల్లో ఆందోళన

రాజాం పట్టణ ప్రధాన రహదారులపై రాత్రి వేళల్లో మూగజీవులు తిరుగుతూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నాయి. చీకటిలో దూరం నుండి స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఈ సమస్యపై పలుమార్లు మున్సిపల్ అధికారులకు నివేదించినప్పటికీ, పెద్దగా చర్యలు తీసుకోలేదని స్థానికులు వాపోతున్నారు. మూగజీవుల యజమానులతో మాట్లాడి, వీధుల్లో తిరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. లేకపోతే ప్రాణనష్టం సంభవించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్