కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేసే నిర్ణయం పేదల పాలిట శాపమని వైసీపీ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. మరిపల్లి పంచాయతీలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, పీపీపీ విధానం పేదలకు అన్యాయమని విమర్శించారు. ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, వైద్య కళాశాలలు ప్రైవేట్ పరం చేస్తే పేదలకు వైద్యం అందడం కష్టమవుతుందని పేర్కొన్నారు. ఈ నెల 11న సాలూరులో జరగనున్న ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.