సాలూరు: 'ప్రత్తి రైతులు దళారులకు అమ్మి నష్టపోవద్దు'

సాలూరు ఎఎంసీ కార్యదర్శి నరేశ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం, ప్రత్తి పండించే రైతులు నష్టపోకుండా ఎమ్మెస్పీ రేటు వచ్చేలా వారంలో కొనుగోలు ప్రారంభిస్తామని తెలిపారు. సాలూరు, పాచిపెంట, మక్కువ మండలాల్లో 4708 ఎకరాల్లో ప్రత్తి పంట వేశారు, దీని ద్వారా సుమారు 37664 క్వింటాల ప్రత్తి దిగుబడి వస్తుందని అంచనా. పొడవు రకం ప్రత్తి క్వింటాల్‌కు రూ.8,110లు, పొట్టి రకం ప్రత్తికి రూ.7,710ల ధర నిర్ణయించారు. రైతులు దళారులకు అమ్మవద్దని సూచించారు.

సంబంధిత పోస్ట్