మొంథా తుఫాన్ కారణంగా విజయనగరం జిల్లా రైతులు తీవ్రంగా నష్టపోయారు. జామి మండలంలో భారీ వర్షాలు, నీటి ముంపుతో సుమారు 188 హెక్టార్ల వరి పంట దెబ్బతిన్నట్లు మండల వ్యవసాయ అధికారి ఎం. పూర్ణిమ తెలిపారు. తుఫాన్ ప్రభావిత గ్రామాలను పరిశీలించిన అధికారులు, నేలకొరిగిన వరిని కట్టలు కట్టి, ఉప్పు ద్రావణం చల్లడం ద్వారా పంట రంగు మారకుండా, తెగుళ్లు రాకుండా చూడాలని రైతులకు సూచించారు.