AP: విశాఖ త్వరలో డేటా హబ్‌గా అభివృద్ధి అవుతుందంటూ ఏపీ TDP అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళగిరిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. విశాఖలో సిఫీ ఏఐ ఎడ్జ్ డేటా సెంటర్‌కు శంకుస్థాపన జరపనున్నట్టు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో అనేక కంపెనీలు విశాఖకు రావడంతో రాష్ట్ర యువతకు ఉద్యోగ అవకాశాలు ఏర్పడుతాయని చెప్పారు. అలాగే విశాఖకు కంపెనీలు తీసుకురావడంలో సీఎం చంద్రబాబు, లోకేష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.