విశాఖలో లగ్జరీ టౌన్‌షిప్ ప్రతిపాదన

సోమవారం, ముంబయిలో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ రుస్తోంజీ గ్రూప్ ఛైర్మన్ బొమన్ ఇరానీతో సమావేశమయ్యారు. విశాఖపట్నంలో ఒక లగ్జరీ టౌన్‌షిప్ ప్రాజెక్ట్ చేపట్టాలని మంత్రి లోకేష్ రుస్తోంజీ గ్రూప్‌ను కోరారు. ఐటీ కంపెనీలు, డేటా సెంటర్ల రాకతో విశాఖ వేగంగా అభివృద్ధి చెందుతోందని, ఈ నేపథ్యంలోనే ఈ ప్రతిపాదన చేశారు. గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌ల నిర్మాణంలో రుస్తోంజీ సంస్థకు దేశవ్యాప్తంగా మంచి పేరుంది. ఇప్పటికే ఈ సంస్థ 25 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో ప్రాజెక్టులను పూర్తి చేసింది, మరో 43 మిలియన్ చదరపు అడుగుల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి.

సంబంధిత పోస్ట్