కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మంగళవారం విశాఖపట్నం రానున్నారు. కురుపాం విద్యార్థులు అస్వస్థతకు గురై విశాఖ కేజీహెచ్‌లో చికిత్స పొందుతుండగా, వారిని పరామర్శించేందుకు ఆమె వస్తున్నారని పార్టీ నేతలు సోమవారం రాత్రి తెలిపారు. షర్మిల మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి, 12:15 గంటలకు విశాఖ చేరుకుని, ఒంటిగంటకు కేజీహెచ్‌కు వెళ్లి విద్యార్థులను పరామర్శిస్తారు.